ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్స్.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్!

టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఎలా కొట్లాడుతూ ఉన్నా కూడా హీరోలు మాత్రం కలిసి మెలిసి ఉంటారు.వారు ఫ్యాన్స్ ను కూడా అలానే ఉండాలని ఎప్పుడు సూచిస్తూ ఉంటారు.

 Nani Shares Throwback Pic Due To World Friendship Day-TeluguStop.com

కానీ మన ఫ్యాన్స్ మాత్రం అస్సలు వినరు.మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా మరొకసారి మన టాలీవుడ్ స్టార్స్ ఒకే ఫ్రేములో సందడి చేసారు.

 Nani Shares Throwback Pic Due To World Friendship Day-ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్స్.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరా ఆ స్టార్స్ అని ఆలోచిస్తున్నారా.

మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, నాని అందరు కలిసి దిగిన ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోను నాని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా అది కాస్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఆగస్టు 1 న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నాని ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అన్ని ఇండస్ట్రీల సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో సందడి చేసారు.వాళ్ళ మిత్రులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నారు.అలాగే మన టాలీవుడ్ స్టార్ నాని కూడా తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

ఆ ఫొటోలో మన బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానా, ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పటు నాని కూడా ఉన్న ఫోటోను షేర్ చేసాడు.

నా ఆప్తులు అంటూ ఈ ఫోటోను షేర్ చెయ్యడంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటో రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్ళిలో దిగిన ఫోటో.దేనిని నాని ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు.

ఈ ఫోటోను చుసిన అభిమానులు తమ ఫేవరైట్ స్టార్ ఫోటోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.మీరు కూడా ఆ ఫోటోను చూసేయండి.

#NaniWith #Rana Daggubati #Nani Twitter #Prabhas #Friend Ship Day

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు