బిగ్ బాస్ సీజన్ 6 పూర్తి కాగా సీజన్ 7 ఎప్పుడా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా నాగార్జున చేసే అవకాశం అయితే లేదు.
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సూపర్ అనిపించుకుంటున్నా ఇది చేస్తున్న టైం లో సినిమాల మీద ఫోకస్ చేయడం కుదరట్లేదని నాగ్ బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పాడట.అయితే ఇప్పుడు కొత్త హోస్ట్ ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉంది బిగ్ బాస్ టీం.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా చేసిన నానిని మరోసారి హోస్ట్ గా చేస్తావా అని అడిగారట.
దానికి నాని దండం పెట్టేసినట్టు తెలుస్తుంది.
సీజన్ 2 టైం లో తన మీద వచ్చిన నెగిటివిటీని నాని తట్టుకోలేకపోయాడు.అందుకే ఇక జీవితంలో మళ్లీ బిగ్ బాస్ హోస్ట్ గా చేసేది లేదని తెగేసి చెప్పడు.
కానీ సీజన్ 7 హోస్ట్ గా నాగ్ హ్యాండ్ ఇచ్చేసరికి ఒక సీజన్ అనుభవం ఉన్న నాని చేస్తాడేమో అని బిగ్ బాస్ టీం అడిగితే సారీ అని చెప్పేశాడట.బిగ్ బాస్ చేయడం వల్ల క్రేజ్ సంగతి పక్కన పెడితే నెగిటివిటీ ఎక్కువ అవుతుంది.
నాగార్జున అంటే పెద్ద హీరో కాబట్టి సరిపోతుంది మరి సీజన్ 7 హోస్ట్ గా ఎవరు చేస్తారో చూడాలి.