మాస్ రాజాకు మరో సాయం చేసిన నాని  

Nani Raviteja Vakkantham Vamsi - Telugu Nakkina Trinadha Rao, Nani, Raviteja, Vakkantham Vamsi

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ప్రస్తుతం లాక్‌డౌన్ తరువాత రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రవితేజ మరోసారి రెడీ అవుతున్నాడు.

 Nani Raviteja Vakkantham Vamsi

కాగా ఈ సినిమా తరువాత రవితేజ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు.ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని తనవద్దకు వచ్చిన ఓ సినిమాను ఇదివరకు రవితేజకు అప్పగించాడు.

దర్శకుడు నక్కిన త్రినాథరావు వినిపించిన ఓ మాస్ చిత్రాన్ని రవితేజకు రికమెండ్ చేశాడట నాని.

మాస్ రాజాకు మరో సాయం చేసిన నాని-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలుస్తోంది.

రైటర్ నుండి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ప్రస్తుతం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడట.కాగా ఈ కథను నానికి వినిపించాడట వక్కంతం వంశీ.సినిమా కథ బాగా నచ్చడంతో నాని ఈ సినిమా తనకంటే కూడా మాస్ రాజా రవితేజకు బాగా సూట్ అవుతుందని భావించాడట.దీంతో వక్కంతం చిత్రానికి ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా కథను రవితేజకు వినిపించలేకపోయిన వక్కంతం, లాక్‌డౌన్ ముగియగానే ఈ కథను ఆయనకు వినిపించాలని చూస్తున్నాడట.మరి వక్కంతం కథ రవితేజకు నచ్చుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ రవితేజ ఈ స్క్రిప్టుకు నో చెబితే వక్కంతం పరిస్థితి ఏమిటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.కాగా క్రాక్ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test