సత్యదేవ్ కి అభిమానిగా మారిపోయిన నాని  

Nani Praises on Satyadev After Seeing New Movie, Natural Star Nani, Umamaheswara UgraRoopasya Movie, Venkatesh Maha - Telugu

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో తన టాలెంట్ తో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తూ వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్.తనని తాను విలక్షణ నటుడుగా ఆవిష్కరించుకుంటూ సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

 Nani Praises On Satyadev After Seeing New Movie

బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ నటనకి ఫిదా అయిపోయారు అంటూ ఏ రేంజ్ లో తనని తాను నటుడుగా ఆవిష్కరించుకుంటున్నాడో అర్ధం చేసుకోవచ్చు.ప్రకాష్ రాజ్ లాంటి నటుడు నుంచి ప్రశంసలని సత్యదేవ్ అందుకున్నాడు.

ఇక సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మలయాళీ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

సత్యదేవ్ కి అభిమానిగా మారిపోయిన నాని-Movie-Telugu Tollywood Photo Image

సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా ఉందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది

ఇక నేచురల్ స్టార్ నాని ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో హీరోగా నటించిన సత్యదేవ్ ని ఆకాశానికి ఎత్తేశాడు.ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఓ అద్భుతం.

థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాని మరోసారి రిలీజ్ చేయండి.థియేటర్ లో ఆ ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ చూడాలని ఉంది.

వెంకటేష్ ఈ సినిమాని నిజాయితీగా ఆవిష్కరించారు.డియర్ సత్యదేవ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను నీ అభిమానిగా మారిపోయాను.

సుహాస్ అందరిని నవ్వించాడు.చాలా గొప్ప సినిమా తీశారు అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఇక రచయిత కోన వెంకట, పూరీ జగన్నాథ్ కూడా సినిమా చూసి సత్యదేవ్ ని ప్రశంసలు కురిపించారు.మొత్తానికి ఈ సినిమాతో సత్యదేవ్ నటుడుగా మరో ఐదు మెట్లు ఎక్కేసాడని ఇండస్ట్రీలో ఇప్పుడు గట్టిగా చెప్పుకుంటున్నారు.

#Venkatesh Maha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nani Praises On Satyadev After Seeing New Movie Related Telugu News,Photos/Pics,Images..