షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆ పని చేస్తున్న నాని.. ఏమైందంటే..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరు హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు.సెకండ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో షూటింగ్ లు చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.

 Nani Playing With His Son Video Goes Viral In Social Media-TeluguStop.com

నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నజ్రియా హైదరాబాద్ నగరంలో కేసులు పెరగడంతో షూటింగ్ కు ప్యాకప్ చెప్పి వెళ్లిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.

 Nani Playing With His Son Video Goes Viral In Social Media-షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఆ పని చేస్తున్న నాని.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇంటికే పరిమితమైన నాని కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.కొడుకుకు కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ ఆ వీడియోలను నాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
కొడుకు అర్జున్ తో కలిసి నాని ఆడుకుంటూ హంగామా చేస్తున్నారు.అర్జున్ క్యూట్ గా మాట్లాడిన మాటలకు నెటిజన్లు ఫిదా కావడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత నాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోను చూసి లవ్ ఎమోజీలను కామెంట్ గా పెట్టడం గమనార్హం.మరోవైపు నాని ఈ ఏడాది కనీసం 3 సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

టక్ జగదీష్ మూవీకి ఓటీటీ ఆఫర్లు వస్తున్నా నాని మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.నాని నటించిన సినిమాలలో ఎన్ని సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా నానికి వరుస ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

#NaniPlaying #Goes Viral #Nani #Son Arjun #NaniPlaying

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు