జెర్సీ దర్శకుడుతో మరో స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకెళ్లనున్న నాని

నేచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో జెర్సీ మూవీ చేసి హిట్ కొట్టాడు.క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాని గౌతమ్ తెరపై ఆవిష్కరించాడు.

 Nani One Sports Backdrop Movies With Gautham Tinnanuri, Jersey Movie, Shraddha S-TeluguStop.com

ఈ సినిమాకి ఏకంగా రెండు జాతీయ అవార్డులు రావడంతో మరోసారి ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఈ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో గౌతమ్ తెరకెక్కిస్తున్నారు.

అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే హిందీ జెర్సీ రిలీజ్ తర్వాత గౌతమ్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో బన్నీ లేదంటే రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ నడిచింది.

అయితే దానిలో ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు.

అయితే ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.గౌతమ్ మళ్ళీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టొరీనే సిద్ధం చేసాడని, అలాగే నానితోనే ఈ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రాలేదు.ఇండియాలో ఫుట్ బాల్ క్రీడకి అంత ప్రాముఖ్యత లేకపోవడంతో దర్శకులుగా ఆ స్పోర్ట్స్ ని కథాంశంగా ఎంచుకోలేదు.

బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో మొదటి ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ మూవీ వస్తుంది.ఈ నేపధ్యంలో గౌతమ్ కూడా ఓ ఇంటరెస్టింగ్ కథని ఆ స్పోర్ట్స్ నేపధ్యంలో సిద్ధం చేసి నానికి వినిపించాడని సమాచారం.

నాని కూడా ఈ మూవీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube