మరో ట్వీట్ తో దుమారం రేపిన నాని  

Nani One More Tweet-chandrababu Naidu,nani,tdp,vijayawada

గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో మొదలైన కేశినేని నాని వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీ నేత ల ను టార్గెట్ చేస్తున్నారో, లేదా అధికార పార్టీ ని టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు కానీ వార్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. మరోపక్క వీరి వరుస ట్వీట్స్ తో అధినేత చంద్రబాబు సైతం తలపట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

మరో ట్వీట్ తో దుమారం రేపిన నాని -Nani One More Tweet

అయితే తాజాగా మరో ట్వీట్ తో నాని దుమారం రేపారు. “నేను ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా. నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది.

ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు.” అంటూ ఓ ట్వీట్ చేసిన నాని. ఆ వెంటనే ” ”ప్రబుద్ధుడు” తో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది.” అంటూ మరో ఘాటు ట్వీట్ చేశారు. ఐతే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు అన్న విషయం అర్ధం కావడం లేదు కానీ, ఎవరో తనకు దగ్గరగా ఉండి దూరమైన వ్యక్తుల గురించో లేదంటే తన గురించి తెలుసినవారి గురించో ఈ వ్యాఖ్యలు చేసినట్లు అయితే స్పష్టమౌతుంది.

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఒకరకంగా యుద్ధమే నడిచింది అని చెప్పాలి. ఒకరిపైనొకరు వ్యక్తిగత విమర్శల తో పోటీ పడి మరి విమర్సించుకున్నారు. ఒకానొక సమయంలో బుద్దా వెంకన్న దివంగత టీడీపీ నేత బాలయోగి ఆస్తులు కాజేశావు అంటూ ఆరోపణలు కూడా చేశారు.

దీనితో బుద్దా కు ఘాటుగానే సమాధానం ఇచ్చారు నాని. అవును బాలయోగి ఆస్తులు అయిన నీతి,నిజాయితీ వంటి మంచి లక్షణాలను కాజేశాను అంటూ రిప్లై ఇచ్చారు. .

ఇంత నడుస్తున్నా అధినేత మాత్రం నేరుగా నానిని ఏవిధంగానూ మందలించడం లేదు సరికదా కనీసం బుజ్జగించడం కూడా లేదు. మరోపక్క ఈ వరుస ట్వీట్స్ చూస్తుంటే పార్టీ నుంచి తప్పుకోవడానికి నాని పక్కా ప్లానింగ్ చేస్తున్నారు అంటూ విమర్సలు కూడా వినిపించకమానడం లేదు.

తనంతట తాను పార్టీ మారడం కన్నా పార్టీ సస్పెన్షన్ కు గురిచేస్తే అప్పుడు పార్టీ మారుదాం అన్న ఆలోచనలో నాని ఉన్నారా అన్న విషయం మాత్రం అర్ధంకావడంలేదు. ఏది ఏమైనా మాత్రం గత కొద్దీ రోజులుగా నాని ట్వీట్స్ మాత్రం సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి .