నాని గత ఏడాది సమ్మర్ లో ‘వి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఆ సమయంలోనే కరోనా రావడం వల్ల సినిమా ను వాయిదా వేశారు.
లాక్ డౌన్ తర్వాత సినిమాను విడుదల చేద్దామని నిర్మాత మొదట భావించాడు.కాని అమెజాన్ నుండి వస్తున్న బిగ్ ఆఫర్ కారణంగా నాని సినిమా ను దిల్ రాజు వదిలేశాడు.‘వి‘ సినిమా కు ఓటీటీ లో బ్యాడ్ టాక్ వచ్చింది.పెద్ద ఎత్తున అంచనాలున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ముగించారు.
సెకండ్ వేవ్ కు ముందు విడుదల చేయాలని భావించారు.విడుదల తేదీని కూడా ప్రకటించారు.
కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల చేయలేక పోయారు.దాంతో గుమ్మడి కాయ కొట్టి ఇంకా ఎంత కాలం ఉంటామనే ఉద్దేశ్యంతో ఇటీవలే టక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేశారు.

నాని టక్ జగదీష్ సినిమా ను సెప్టెబంర్ 10న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టక్ జగదీష్ సినిమాను ఎలా అయితే ఓటీటీకి ఇచ్చేశారో అదే విధంగా శ్యామ్ సింగరాయ్ ని కూడా ఓటీటీ కి అడిగేస్తున్నారట.ఆ సినిమా కు గాను అమెజాన్ మరియు హాట్ స్టార్ లు భారీ మొత్తంను కొనుగోలు చేసేందుకు గాను చర్చలు జరుపుతున్నాయట.నిర్మాతలు టెమ్ట్ అయ్యే విధంగా వారు రేట్లు చెబుతున్నారట.
సినిమా బడ్జెట్ కంటే దాదాపుగా డబుల్ మొత్తానికి ఇచ్చేలా ఒప్పందాలు వస్తున్నాయట.కాని థియేటర్ రిలీజ్ కు వెళ్లాలని భావిస్తున్నారు.
ఒక వేళ నాని నటించిన ఈ సినిమా కూడా ఓటీటీ విడుదల అయితే ఖచ్చితంగా ఆయనపై విమర్శలు తప్పవు.స్వయంగా ఆయన అభిమానులు ఆయన్ను క్షమించరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.