శివ నిర్వాణతో చేయడం నానికి ఇష్టంలేదా..?

అప్పటికే నానితో నిన్ను కోరి సినిమా తీసి హిట్ అందుకున్న డైరక్టర్ శివ నిర్వాణ ఆ తర్వాత నాగ చైతన్యతో మజిలీ సినిమా తీసి మరో హిట్ కొట్టాడు.ఇక హ్యాట్రిక్ సినిమాగా మరోసారి నానితో టక్ జగదీష్ అంటూ వస్తున్నాడు.

 Nani Not Interest To Do Movie With Shiva Nirvana, Shiva Nirvana, Nani, Tuck Jaga-TeluguStop.com

ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కథ విషయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.శివ టాలెంట్ గుర్తించిన నాని నిన్ను కోరి టైం లోనే అతనితో మళ్లీ చేయాలని అనుకున్నాడట.

అయితే మజిలీ తర్వాత నానితో సినిమా శివ నిర్వాణ ప్లాన్ చేస్తుంటే.శివ చెప్పేది లవ్ స్టోరీ అయితే నాని రిజెక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాడట.

అతనితో మరో లవ్ స్టోరీ చేయడం నానికి ఇష్టం లేదట.కాని శివ నిర్వాణ అనూహ్యంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ చెప్పేసరికి నాని సూపర్ అనేశాడట.

శివ నిర్వాణ టక్ జగదీష్ కథను నానికి కేవలం 10 నిమిషాల్లో చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది.శివ మీద నమ్మకం ఉన్న నాని వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశాడట.

టక్ జగదీష్ హిట్టైతే ఈసారి నానితో డిఫరెంట్ జోనర్ సినిమా ప్లాన్ చేస్తానని.హ్యాట్రిక్ మూవీ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నాడు శివ నిర్వాణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube