నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.
అయితే తాజాగా నాని నటించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు మిగతా ఇండస్ట్రీ వారు ఆసక్తి చూపుతున్నారు.శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు జనం నీరాజనం పట్టారు.ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా నాని యాక్టింగ్‌కు జనం బాగా కనెక్ట్ కావడంతో, ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ తన సత్తా చాటింది.
ఈ సినిమాతో నాని ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేశాడు.ఇక ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చురుగ్గా జరుగుతుండగా, ఇప్పుడు ఈ కథ కన్నడ ఇండస్ట్రీకి చేరింది.
కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు దర్శకుడు నంద కిషోర్ ఆసక్తి చూపుతుండగా ఈ సినిమాలో నాని పాత్రలో నటించేందుకు ధృవ సార్జా రెడీ అవుతున్నాడట.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.