కంచికి కాదు.. కన్నడకు చేరిన నాని కథ

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.

 Nani Ninnu Kori Movie To Be Remade In Kannada-TeluguStop.com

అయితే తాజాగా నాని నటించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు మిగతా ఇండస్ట్రీ వారు ఆసక్తి చూపుతున్నారు.శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు జనం నీరాజనం పట్టారు.ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా నాని యాక్టింగ్‌కు జనం బాగా కనెక్ట్ కావడంతో, ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ తన సత్తా చాటింది.

ఈ సినిమాతో నాని ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేశాడు.ఇక ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చురుగ్గా జరుగుతుండగా, ఇప్పుడు ఈ కథ కన్నడ ఇండస్ట్రీకి చేరింది.

కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు దర్శకుడు నంద కిషోర్ ఆసక్తి చూపుతుండగా ఈ సినిమాలో నాని పాత్రలో నటించేందుకు ధృవ సార్జా రెడీ అవుతున్నాడట.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube