నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాని తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
ఇప్పటికే టక్ జగదీష్ చిత్ర షూటింగ్‌ను మెజారిటీ శాతం పూర్తి చేసిన నాని, ‘శ్యామ్ సింఘ రాయ్’ అనే సినిమాను లైన్లో పెట్టాడు.అయితే తాజాగా నాని తన పాత చిత్రంతో ఓ కొత్త రికార్డు కొట్టాడు.
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు చాలా మంది ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు.
ఇక ఈ సినిమా అందుకున్న భారీ విజయంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా 25 మిలియన్ వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.ఇలా 2017లో వచ్చిన ‘నిన్ను కోరి’ చిత్రం ఇంకా వార్తల్లో నిలవడంతో అటు నాని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.
శివా నిర్వాణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నాని నటన అత్యద్భుతంగా ఉండటంతో ఆయన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ‘నిన్ను కోరి’ నిలిచింది.
ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులను ఈ సినిమా కట్టిపడేసిన విధానం మనందరికీ తెలిసిందే.ఇక నాని ఇటీవల మరో సినిమాను ఓకే చేయగా, దానికి ‘అంటే సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
ఇలా నాని వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా వాటితో రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.