రగ్డ్ లుక్ లో నాని.. 'ఈ దసరా నిరుడు లెక్క ఉండదట'..!

Nani Next With Srikanth Odela Titled Dasara

న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 Nani Next With Srikanth Odela Titled Dasara-TeluguStop.com

ఒక వైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఇంకో వైపు మరొక కొత్త సినిమాను ప్రకటించాడు.రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ పై అభిమానులు భారీ అంచనాలని పెట్టుకున్నారు.

ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుందనగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు నాని ‘అంటే సుందరానికి‘ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి.

 Nani Next With Srikanth Odela Titled Dasara-రగ్డ్ లుక్ లో నాని.. ఈ దసరా నిరుడు లెక్క ఉండదట’..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ రోజు దసరా పండుగ సందర్భంగా నాని మరొక కొత్త సినిమా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు.నాని కెరీర్ లో 29 సినిమాగా ఈ సినిమా రాబోతుంది.

శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు ‘దసరా‘ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఒక పోస్టర్ వదిలారు.ఈ పోస్టర్ లో నాని రగ్డ్ లుక్ లో దర్శన మిచ్చాడు.

ఇక ఈ సినిమాలో నాని కి జోడీగా కీర్తి సురేష్ మరొకసారి నటించ బోతుంది.

ఇప్పటికే నేను లోకల్ సినిమాలో నటించిన వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.ఇక ఇప్పుడు మరొకసారి జోడీ కట్టబోతున్నారు.‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదు’ అంటూ ఈ సినిమా టైటిల్, పోస్టర్ విడుదల చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు నాని.ఇక ఈ పోస్టర్ లో నాని రింగుల జుట్టుతో, డీ గ్లామర్ గా చెవికి పోగు పెట్టుకుని రగ్డ్ లుక్ లో కనిపించాడు.ఇక పోస్టర్ మాత్రమే కాదు సైరన్ ఆఫ్ దసరా పేరుతో గ్లిమ్స్ కూడా విడుదల చేసారు.

ఇది కూడా ఆసక్తికరంగా ఉండి అభిమానులను ఆకట్టుకుంటుంది.

https://youtu.be/retamiUoLEI
#Srikanth Odela #Dasara #NaniSrikanth #Nani #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube