నాని పుట్టిన రోజు కానుక! కొత్త సినిమా టైటిల్ అనౌన్స్!

నేచురల్ స్టార్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యెక గుర్తింపు సొంతం చేసుకొని అతి తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరో నాని.అసిస్టెంట్ దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన నాని తరువాత హీరోగా టర్నింగ్ తీసుకొని వరుస హిట్స్ తో వేవ్ లా దూసుకొచ్చాడు.

 Nani New Movie Tittle Will Be Announced Today-TeluguStop.com

తరువాత కెరియర్ లో కొంత డీలా పడ్డా మరల భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ కి దూసుకోచ్చేసాడు.

మినిమం గారంటీ హీరోగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నానితో సినిమా చేయడానికి ప్రతి నిర్మాత ఆసక్తి చూపిస్తాడు.

కొత్త దర్శకుల నుంచి, స్టార్ దర్శకుల వరకు ఎవరితో అయిన కథ నచ్చితే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా కమిటైపోతాడు.

నానిలో వున్న ఈ ఆటిట్యూడ్ అతన్ని టాలీవుడ్ మంచి క్రేజీ హీరోగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా నిలబెట్టింది.ఇదిలా వుంటే ప్రస్తుతం జెర్సీ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నాని నెక్స్ట్ విలక్షణ చిత్రాల దర్శకుడుగా పేరున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ప్రారంబోత్సవం జరుపుకోగా నాని పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం సినిమా టైటిల్ ని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube