శ్యామ్ సింగరాయ్ గా నేచురల్ స్టార్ నాని!  

Nani New Movie Title Shyam Singha Roy - Telugu Director Rahul, Nani New Movie, Shyam Singha Roy, Shyam Singroy, Telugu Cinema, Tollywood

నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేసుకుంటూ తన క్రేజ్, ఇమేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కథల ఎంపికలో తప్పతడులు వేస్తూ ఉంటె నాని మాత్రం ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

Nani New Movie Title Shyam Singha Roy - Telugu Director Rahul Singroy Cinema Tollywood

ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో ఎబ్భై కోట్ల వరకు స్టాండర్డ్ మార్కెట్ ఉన్న హీరో అంటే నాని పేరు వినిపిస్తుంది.అయితే నేచురల్ స్టార్ నానికి కూడా ఈ మధ్య గ్యాంగ్ లీడర్ తో ఫ్లాప్ పడింది.

ప్రస్తుతం వి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో కెరియర్ లో మొదటి సారి నని నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత నాని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ని చిత్ర నిర్మాతలు ఈ రోజు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.స్కెచ్ ఆర్ట్ రూపంలో ఈ పోస్టర్ కేవలం హీరో కళ్ళని చూపిస్తూ శ్యామ్ సింగరాయ్ అనే సినిమా టైటిల్ ని రివీల్ చేశారు.

టైటిల్ బట్టి ఇది హీరో పాత్ర పేరులా ఉంది.టైటిల్ పోస్టర్ డిజైన్ బట్టి చూస్తూ ఉంటే ఇదో డిఫరెంట్ జోనర్ మూవీ అని అర్ధమవుతుంది.

ఇప్పటి వరకు క్లాస్ టైటిల్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో తాను చేసే సినిమాలు జోనర్స్ పూర్తిగా మార్చేసి కొత్తదనం ఉన్న కథలతో వెళ్తున్నారు.అందులో భాగంగానే గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలు చేసాడు.

ఇదే దారిలో ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ ఉంటుందని తెలుస్తుంది.

తాజా వార్తలు

Nani New Movie Title Shyam Singha Roy-nani New Movie,shyam Singha Roy,shyam Singroy,telugu Cinema,tollywood Related....