ట్రైలర్ టాక్ : అంటే సుందరానికి.. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తారీకున విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన విషయం తెల్సిందే.

 Nani Nazriya Ante Sundaraniki Movie Trailer Talk Details, Ante Sundaraniki, Hero-TeluguStop.com

సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఈ సమయంలో సినిమా విడుదల ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అంచనాలను మరింతగా పెంచారు.

సినిమా ట్రైలర్ విషయంలో మొదటి నుండి అంచనాలు ఆసక్తి ఉంది.సినిమా టీజర్ లోనే కథ ఏంటో చెప్పకనే చెప్పారు.

సుందరం బ్రహ్మణ కుటుంబంకు చెందిన వ్యక్తి కాగా.హీరోయిన్ పాత్ర లీలా క్రిస్టియన్.

పక్కాగా మతాచారాలను అనుసరించే ఈ రెండు కుటుంబాలకు చెందిన సుందరం మరియు లీలా లు ప్రేమలో పడటం.అక్కడ నుండి అసలు కథ మొదలు అవుతుంది.

రెండు ఫ్యామిలీల మద్య ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయి అనేది సినిమా ను చూసి తెలుసుకోవాల్సిందే.హీరోయిన్‌ నజ్రియా మొదటి సారి తెలుగు లో నటించింది.

గతంలోనే ఈమెకు తెలుగు లో మంచి మార్కెట్‌ ఉంది.డబ్బింగ్‌ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

దాంతో అంటే సుందరానికి సినిమాకు ఈమె అదనపు ఆకర్షణ గా నిలువబోతుంది.

Telugu Actressnazriya, Antesundaraniki, Nani, Nazriya, Leela, Nadiya, Senior Nar

నాని ఏ పాత్ర చేసినా కూడా జీవించేస్తాడు.సుందరం పాత్రలో కూడా ఎప్పటిలాగే జీవించేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అంటే సుందరానికి సినిమా ఉండబోతుంది అంటూ ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంది.

నాని తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ పాత్ర లో ఒదిగి పోయిన తీరు.హీరోయిన్ పాత్ర లో నదియా నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని అంటున్నారు.

మొత్తానికి అంటే సుందరానికి కోసం అంతా ఎదురు చూసే విధంగా ట్రైలర్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube