తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించినటువంటి “అష్టా చమ్మా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై తెలుగు సినీ పరిశ్రమలో నేచురల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో నాని గురించి తెలుగు సినీపరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అంతకు ముందే నాని పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేసినట్లు ఇప్పటికి చాలా మందికి తెలియదు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో హీరో నాని గురించి కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన “రాధా గోపాళం” అనే చిత్రానికి నాని అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు.
ఆ సమయంలో నటి స్నేహ తో కలిసి తీసుకున్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.దీంతో కొందరు నాని అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ చేస్తున్నారు.
అంతేగాక నాని ఒక హీరోగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెగ పొగుడుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాని “టక్ జగదీష్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రంలో నానికి జోడీగా కౌసల్య కృష్ణమూర్తి చిత్ర ఫేమ్ “ఐశ్వర్య రాజేష్” హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శివ నిర్మాణం దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “వి” అనే చిత్రంలో కూడా కొంతమేర నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.