నానికి తప్పుడు సలహా వల్ల..!  

గత రెండు సంవత్సరాలుగా నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ఏడు వరుస సక్సెస్‌లు దక్కించుకున్న నాని తాజాగా ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో ఫెయిల్యూర్‌ను చవిచూశాడు. ఇన్నాళ్ల తర్వాత ఫ్లాప్‌ రావడానికి ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

నానికి తప్పుడు సలహా వల్ల..!-

ఆయన ఈ చిత్రం ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న వారు నానితో తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేశారు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు చిత్రాల కోసం మంచి కథలు ఎంచుకున్న నానికి టాలీవుడ్‌లో మంచి కథలు ఎంచుకుంటాడు అనే పేరు ఉంది. కాని ఇప్పుడు మాత్రం ఆయన వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం నాని మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. నాగార్జునతో కలిసి నాని ఈ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో కథపై దృష్టి పెట్టకుండా ఈ చిత్రం కథను నాని ఎంచుకున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక రొటీన్‌ కథాంశంతో దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలవడంఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని గత కొంత కాలంగా వరుసగా కథల ఎంపిక విషయంలో తప్పులో కాలేస్తున్నాడు..

తాజాగా విక్రమ్‌ కుమార్‌తో సినిమా క్యాన్సిల్‌ చేసుకోవడం ఒక పెద్ద తప్పని, ఆయన దర్శకత్వంలో నాని నటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఏ చిత్రం కూడా దారుణంగా ఫ్లాప్‌ కాలేదు. అయినా కూడా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి లేదు అంటూ నాని తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

నాని ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్‌ కుమార్‌తో సినిమాలు చేయాలని తమిళ మరియు తెలుగు హీరోలు పలువురు క్యూ కడుతున్నారు. కాని నాని మాత్రం ఆయనతో సినిమా ఓకే అయిన తర్వాత క్యాన్సిల్‌ చేసుకోవడంతో ఆయన ఫ్యాన్స్‌ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాని తీసుకుంటున్న నిర్ణయాల వెనుక కొందరి తప్పుడు సలహాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాని ఇకపై అయినా జాగ్రత్తగా ఉండకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులో స్టార్‌గా ఎదిగే ఛాన్స్‌ ఉన్న నాని ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.Click here to Reply or Forward