మహేష్ 'నాని' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరో అయ్యాడు?

నేటి చైల్డ్ ఆర్టిస్టులే  రేపటి ఫ్యూచర్ స్టార్లు అని చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారు ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన వారు చాలా మంది ఉన్నారు.

 Nani Movie Child Artist, Nani Movie , Mahesh Babu , Ashok Galla , Tollywood , Child Artist , Hero Movie , Nidhi Agrawal, Sj Surya-TeluguStop.com

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన పూరి ఆకాష్, తేజ సజ్జ లు ఇక ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు.వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నానీ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

 Nani Movie Child Artist, Nani Movie , Mahesh Babu , Ashok Galla , Tollywood , Child Artist , Hero Movie , Nidhi Agrawal, Sj Surya-మహేష్ నాని#8217; సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరో అయ్యాడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మహేష్ బాబు కేరీర్ లో మాత్రం ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా నాని సినిమా నిలిచింది అని చెప్పాలి.

అయితే నాని సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.ఇక ఎన్నో రోజుల పాటు నాని సినిమాలోని పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇకపోతే ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన అబ్బాయి దాదాపు ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటారు.

ఇలా ఒకప్పుడు హీరో ఫ్రెండ్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అబ్బాయికి ఇప్పుడు హీరోగా మారిపోయాడు.ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో అని అనుకుంటున్నారా.

ఎవరో కాదు మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అశోక్ గల్లా.ఇటీవల ‘హీరో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అశోక్ గల్లా.

ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అశోక్ గల్లా మీడియా సమావేశంలో చైల్డ్ ఆర్టిస్టుగా తాను చేసిన రెండు సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి తో చేశాను అంటూ చెప్పుకొచ్చారు అశోక్ గల్లా.

ఇక తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమా చేస్తున్న సమయంలో కనీసం తనకు ఇండస్ట్రీ పైన ఏ మాత్రం అవగాహన లేదు అంటూ చెప్పుకొచ్చాడు.కానీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నాని సినిమా చేసే సమయానికి మాత్రం షూటింగ్ ఎలా ఉంటుంది అన్న విషయం కాస్త తెలిసి వచ్చింది అంటూ అశోక్ గల్లా చెప్పుకొచ్చారు.ఇక ఆ తర్వాత చదువుకుంటున్న సమయంలో సినిమాలపై షూటింగ్ పై పూర్తి అవగాహన తెచ్చుకున్నాను అంటూ అశోక్ గల చెప్పుకొచ్చాడు.ఇక మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా రాణించి ప్రేక్షకుల ఆదరణ పొందబోతున్నాడు అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube