నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా లవ్ స్టోరీ విడుదలకు సిద్దం అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న లవ్ స్టోరీ సినిమాను గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
ఈ ఏడాది లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సాధ్యం అవ్వలేదు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తారీకున ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
రికార్డు స్థాయి లో ఈ సినిమాను ప్రముఖ బయ్యర్ కొనుగోలు చేశాడనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా విడుదల కు ఓటీటీ లు కూడా సంప్రదించారు.
కాని ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని వారు అనుకోవడం లేదు.

ఎట్టకేలకు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడం తో పాట థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్న కారణంగా ఈ సినిమాను సెప్టెంబర్ 10 వ తారీకున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ఇక ఈ సినిమా తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాని ‘టక్ జగదీష్‘ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని మొదట భావించారు.కాని కరోనా వల్ల థియేటర్లు సరిగా లేవు అంటూ ఓటీటీ ద్వారా విడుదల చేయాలని ప్రముఖ ఓటీటీ అమెజాన్ వారికి ఈ సినిమా రైట్స్ ను అమ్మేయడం జరిగింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తారీకున ఈ సినిమాను అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట.అంటే లవ్ స్టోరీ థియేటర్లలో మరియు నాని టక్ జగదీష్ మాత్రం ఓటీటీ లో ఒకే రోజున విడుదల కాబోతున్నాయి.
మరి ఈ సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందని అంటున్నారు.మరో వైపు లవ్ స్టోరీ తరహాలో థియేటర్ రిలీజ్ కు జగదీష్ వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది అనేది కొందరి టాక్.