నాని కాపురం లో చిచ్చు పెట్టిన శ్రీరెడ్డి..? ఇది నా దురదృష్టం అంటూ ఫేస్బుక్ లో పోస్ట్!       2018-06-09   21:58:34  IST  Raghu V

నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్’ సీజన్-2పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ సీజన్-1కు మంచి ఆధరణ లభించిన నేపథ్యంలో సీజన్-2 కూడా రక్తికడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. నాని ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ షోకు ఎంపికయ్యే సెలబ్రిటీలు ఈ సారి 100 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలి. మొత్తం 16 మంది సెలబ్రిటీల్లో ఎవరెవరు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో అడుగుపెడతారనే ఉత్కంఠతకు తెరపడేది కూడా ఆదివారమే. ఇందులో ఉండే సెలబ్రిటీలపై ఇప్పటికే మీడియాలో అనేక ‘లీకులు’ వచ్చాయి. లీకైన జాబితాలో శ్రీరెడ్డి పేరు కూడా వినిపించింది

దానిపై శ్రీరెడ్డి స్పందిస్తూ..తాజాగా శ్రీరెడ్డి మరోసారి నానిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నానిని ఇప్పటికే రెండు మూడు సార్లు టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా బిగ్‌బాస్‌-2 హోస్ట్‌ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ”నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..” అని పేర్కొంది. శ్రీరెడ్డి కామెండ్లు నిజంగానే చేసిందా ? లేదా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసిందా ? అన్నది అర్థం కావడం లేదు.

-

అయితే బిగ్ బాస్ లో పాల్గొనే విషయంపై క్లారిటీ మాత్రం ఇచ్చింది శ్రీరెడ్డి. ‘‘మిత్రులకు చేదువార్త. ఇది నా దురదృష్టం. ‘బిగ్‌బాస్‌’లో నేను లేను. అందులో నేనుంటానని ఊహించవద్దు. ఇది కొందరికి చాలా సంతోషం కలిగిస్తుందని, కొందరు అప్‌సెట్‌ అవుతారని నాకు తెలుసు. పోటీదారులు చాలా అదృష్టవంతులు. ఆల్ ది బెస్ట్ ‘బిగ్‌బాస్‌’ టీమ్’’ అని ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది.