బాలీవుడ్ కు గత రెండు మూడు సంవత్సరాలుగా మన తెలుగు సినిమాల సత్తా ఏంటీ మన తెలుగు వారి ప్రతిభ ఏంటీ అనే విషయంపై క్లారిటీ వస్తుంది.బాహుబలి అక్కడ సాధించిన వసూళ్లకు అంతా కూడా బిత్తర పోయారు.
ఇక అర్జున్ రెడ్డి సినిమా అక్కడ మనోడు సందీప్ రీమేక్ చేయగా ఈజీగా వంద కోట్లు రాబట్టింది.ఇంకా పలు తెలుగు సినిమాలు హిందీలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కొన్ని రీమేక్ అవ్వగా మరి కొన్ని డబ్బింగ్ అయ్యాయి.ఇప్పుడు నాని నటించిన జెర్సీ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అల్లు అరవింద్ మరియు దిల్ రాజులు కలిసి నిర్మిస్తున్నారు.
వీరిద్దరు మొదటి సారి కలిసి బాలీవుడ్ లో సినిమాను నిర్మిస్తున్న కారణంగా మేకర్స్ లో ఆసక్తి ఉంది.ఇక షాహిద్ కపూర్ సినిమా అవ్వడంతో పాటు హిట్ మూవీకి రీమేక్ అవ్వడం వల్ల హిందీ జెర్సీకి ప్రముఖ ఓటీటీ ఏకంగా 50 కోట్ల ఆఫర్ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న కారణంగా ఈ సినిమాకు పెద్ద మొత్తంలో పెట్టేందుకు ఓటీటీ వారు ముందుకు వచ్చారు.అమెజాన్ మరియు నెట్ ఫిక్ల్స్ వారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.జీ5 కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంది.కాని దిల్ రాజు మరియు అల్లు అరవింద్లు మాత్రం హిందీలో థియేటర్లలో విడుదల చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు.
ఈ సినిమా పూర్తి స్థాయి థియేటర్లు ఓపెన్ అయినప్పుడు విడుదల చేస్తే ఖచ్చితంగా వంద కోట్ల బిజినెస్ చేస్తుందని ఎందుకు ఇప్పుడు అనాలోచితంగా ఓటీటీకి ఇవ్వడం అనే ఆలోచనలో ఉన్నటారట.ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది.
ఇద్దరు నిర్మాతలు కూడా ఉన్నొళ్లే.వీళ్లకు సినిమా ఏడాది లేట్ అయినా కూడా పెద్దగా నష్టం ఏమీ లేదు.
కనుక ఇబ్బంది లేకుండా బాలీవుడ్ లో జెర్సీని థియేటర్లలోనే విడుదల చేయాలని వీరు భావిస్తున్నారు.