'జెర్సీ' 11 రోజుల కలెక్షన్స్‌... బయ్యర్ల పరిస్థితి ఏంటీ?

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ చిత్రం విడుదలై రెండు వారాలు కావస్తుంది.ఈమద్య కాలంలో ఏ సినిమాకు దక్కని ప్రశంసలు అయితే ఈ చిత్రంకు దక్కాయి.

 Nani Jersey Movie 11 Days Collections-TeluguStop.com

ఇలాంటి సినిమా చేయాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి, సినిమా అంటే మోజు ఉండాలి, డబ్బులపై ఆశ లేకుండా ఇలాంటి సినిమాలు తీయాలి అంటూ జెర్సీ యూనిట్‌ సభ్యులపై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.అలాంటి జెర్సీ సినిమా కలెక్షన్స్‌ పరంగా వెనుక బడిపోయింది.

మొదట ఈ చిత్రం 15 కోట్ల వరకే ఆగిపోతుందని భావించారు.అయితే బాగానే ఈ చిత్రం 20 కోట్ల వరకు నెట్టుకు వచ్చింది.అయితే బయ్యర్లు సేఫ్‌ అవ్వాలి అంటే ఈ చిత్రం 27.5 కోట్లను వసూళ్లు చేయాల్సి ఉంది.అంత వసూళ్లను ఈ చిత్రం నమోదు చేయడం అసాధ్యం అని ఇప్పటికే తేలిపోయింది.మరి కొన్ని రోజుల్లో కొత్త సినిమాలు వస్తాయి.ఇక ఎవెంజర్స్‌ చిత్రం ఇంకా కూడా దుమ్ము రేపుతూనే ఉంది.జెర్సీ చిత్రం 11 రోజులు ముగిసేప్పటికి కేవలం 20 కోట్ల లోపు వసూళ్లను మాత్రమే నమోదు చేయడం వల్ల ఖచ్చితంగా ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలు మిగల్చబోతున్నట్లుగా చెబుతున్నారు.

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరించడం లేదు.ప్రేక్షకుల ఆధరణకు కరువు అవ్వడం వల్ల కలెక్షన్స్‌ నమోదు అవ్వడం లేదు.

పెద్ద ఎత్తున కలెక్షన్స్‌ వస్తాయని ఊహించిన యూనిట్‌ సభ్యులకు నిరాశే మిగిలింది.ఈ టాక్‌కు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండి ఉంటే సినిమా ఈజీగా 50 కోట్లను వసూళ్లు చేసేది అనే టాక్‌ వస్తోంది.

అయితే ప్రశంసలతోనే యూనిట్‌ సభ్యులు 50 కోట్లు వచ్చినట్లుగా సంతోషిస్తున్నారు.అయితే బయ్యర్లు మాత్రం కనీసం 7 కోట్లకు లాస్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube