శ్యామ్ సింగ రాయ్‌లో నాని అలా కనిపిస్తాడా?  

Nani In Old Get Up In Shyam Singha Roy, Nani, Shyam Singha Roy, Kolkatta, Tollywood News - Telugu Kolkatta, Nani, Shyam Singha Roy, Tollywood News

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవ్వడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

TeluguStop.com - Nani In Old Get Up In Shyam Singha Roy

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తున్నాడు నాని.

ఈ క్రమంలో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.కాగా తన నెక్ట్స్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ను కూడా ప్రారంభించాడు.

TeluguStop.com - శ్యామ్ సింగ రాయ్‌లో నాని అలా కనిపిస్తాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కథ పూర్తి వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో నాని వృద్ధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపించనున్నాడని, అందులో ఈ వృద్ధుడి పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి నాని ఇప్పటివరకు కనిపించని గెటప్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కాగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

మరి ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాను టాక్సీవాలా చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

#Kolkatta #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nani In Old Get Up In Shyam Singha Roy Related Telugu News,Photos/Pics,Images..