బిగ్‌ బాస్-2 షో హిట్టా? ఫట్టా? తొలివారం టి.ఆర్.ఫై చూసి షాక్ అయిన బిగ్ బాస్ టీం!       2018-06-22   00:49:55  IST  Raghu V

బిగ్ బాస్‌-2 షో ప్రారంభమై నేటికి సరిగ్గా 11 రోజులు. ‘స్టార్ మా’ టీవీలో ప్రసారమవుతున్న ఈ షోకు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఉన్నాడు. అయితే షో ప్రారంభానికి ముందు.. ఆ తర్వాత విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సీజన్‌-1లో జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అభిమానులనే కాదు.. కోట్లాదిమంది నెటిజన్లను ఆకట్టుకున్నాడు. దీంతో బిగ్‌ బాస్-1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమాలతో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఈ షోకు హోస్ట్‌‌గా చేయలేకపోవడంతో నానిని ఎంచుకోవడం జరిగింది. మొదట విమర్శలు వచ్చినా మెల్లమెల్లగా నాని.. జూనియర్ రూట్‌‌లోకి వచ్చి తనదైన శైలిలో వీక్షకులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాడు.

తాజాగా విడువులైన టిఆర్పి రేటింగ్స్ బిగ్ బాస్ టీంకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా తొలివారం ఈ షో రేటింగ్స్ సాధించలేకపోయింది. షో ఓపెనింగ్ రోజు 15.05 రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలిసీజన్ ఓపెనింగ్ రోజు 16.18 రేటింగ్ రావడం విశేషం. తొలివారం టిఆర్పి రేటింగ్స్ విషయంలో బిగ్ బాస్ తొలి సీజన్ కంటే రెండవ సీజన్ వెనుకబడిందని చెప్పొచ్చు. వీక్ డేస్ బిగ్ బాస్ 2 షో సగటున 7.93 రేటింగ్ సాధించింది. బిగ్ బాస్ తొలి సీజన్ తొలివారంలో 9.24 రేటింగ్ రావడం విశేషం.

ఈ షో ప్రారంభం రోజున (జూన్ 10) ప్రతి ఇ‍ద్దరిలో ఒకరు చూశారని.. ఓవరాల్‌గా మొదటి వారం ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం మంది షోను వీక్షించినట్లు ‘స్టార్ మా’ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది. మొత్తానికి చూస్తే.. నానికూడా ఇంచుమించు బిగ్‌బాస్-2తో జూనియర్‌ ఎన్టీఆర్ రేంజ్‌‌లో పేరు సంపాదించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకోవచ్చు.