రెమ్యునరేషన్ పెంచేసిన నాని.. అంత తీసుకుంటున్నారా..?

మిడిల్ రేంజ్ హీరోల్లో 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా నాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.హిట్టూఫ్లాపులకు అతీతంగా వరుస సినిమాల్లో నటిస్తున్న నాని నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

 Nani Hikes His Remuneration For Shyam Singaroy Movie, 14 Crores,  Hikes Remunera-TeluguStop.com

నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుండగా శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.టక్ జగదీష్ ఫ్యామిలీ స్టోరీగా తెరకక్కనుండగా శ్యామ్ సింగరాయ్ పీరియాడిక్ స్టోరీ కావడం గమనార్హం.

ఇకపోతే నాని రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది.కరోనా ముందు వరకు నాని సినిమాకు 9 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.

అయితే ప్రస్తుతం నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నాని రెమ్యునరేషన్ ను ఏకంగా 14 కోట్ల రూపాయలకు పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Nani, Shyam Singaroy-Latest News - Telugu

నాని రెమ్యునరేషన్ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం నాని 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.శ్యామ్ సింగరాయ్ డిజిటల్, శాటిలైట్ హక్కులకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ట్యాక్సీవాలా సినిమా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ టక్ జగదీష్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో నాని మూడు గెటప్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

నాని గత చిత్రం వి ఫ్లాప్ కావడంతో నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube