నాని.నేచురల్ స్టార్.చక్కటి సినిమాలు చేస్తూ ముందుకుసాగుతున్న యంగ్ హీరో.ఆయన చేసే క్యారెక్టర్లు.కాంప్లికేటెడ్ కాకుండా.చాలా సహజంగా ఉంటాయి.
మన పక్కింట్లో అబ్బాయిలా కనిపిస్తాడు.ఏపాత్ర చేసినా సరే.ఇట్టే అందులో లీనమై పోతాడు.జనాలకు కూడా చాలా బాగా రీచ్ అవుతాడు.
తను చేసే సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందే.అంతే స్థాయిలో హీరోయిన్ కు ఇంపార్టెన్సీ ఉంటుంది.
తన తొలి చిత్రం అష్టాచెమ్మా నుంచి తాజాగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ వరకు అన్ని సినిమాల్లో హీరోయిన్లు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషించారు.
నాని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 14 ఏండ్లు అవుతుంది.
నటుడిగా ఎన్నో మంచి సినిమాలు చేసినా.ఒకే ఒక్కసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.గమ్మత్తైన విషయం ఏంటంటే తన సినిమాల్లో నటించిన ముగ్గురు హీరోయిన్లు ఉత్తమ నటిగా అవార్డులు అందుకోవడం విశేషం.2008లో అష్టా చెమ్మా సినిమాలో హీరోయిన్ గా చేసిన కలర్స్ స్వాతి.తొలిసారి బెస్ట్ హీరోయిన్ గా నంది అవార్డును దక్కించుకుంది.ఆ తర్వాత 2011లో అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది బొద్దుగుమ్మ.కేరళ బ్యూటీ నిత్యా మీనన్.ఈ సినిమాకు గాను తను ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది.2012లో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా సమంతా నంది అవార్డులు దక్కించుకున్నారు.మొత్తంగా ఆయనతో నటించిన ముగ్గురు హీరోయిన్లు నంది పురస్కారాలను తీసుకున్నారు.
నానితో వెండితెరను పంచుకున్న ముగ్గురు అందాల భామలకు అద్భుత క్యారెక్టర్లు ఇచ్చారు.వారు కూడా మంచి నటన కనబర్చారు.అందుకే స్వాతి, నిత్య మీనన్, సమంత.నానితో నటించిన తొలి సినిమాల తోనే నందులను కైవసం చేసుకున్నారు.అందరు హీరోయిన్లకు ఇది తొలి నంది కావడం విశేషం.ఇవాళ ఈ నేచురల్ స్టార్ బర్త్ డే.ఆయన కెరీర్ లో మరెన్నో సినిమాలు చేయాలని.ఆయా సినిమాలు తనకు మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.