వావ్‌ క్రేజీ కాంబో: నాని, సమంత రెండు సూపర్‌ హిట్స్‌, ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం

నాని హీరోగా నిన్నుకోరి చిత్రంను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.చాలా విభిన్నమైన ప్రేమకథను చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించి మెప్పించిన శివ నిర్వాన తన రెండవ సినిమాను మజిలీగా తెరకెక్కించాడు.

 Nani Hatric Movie With Samanth In Sia Nirvana Directions-TeluguStop.com

మజిలీ చిత్రంలో నాగచైతన్య మరియు సమంతలు జంటగా నటించారు.పెళ్లి అయిన తర్వాత వారిద్దరు నటించిన సినిమా అవ్వడం, అందులోనూ ఆ సినిమాలో భార్య భర్తలుగా నటించడం నిజంగా అందరిని ఆకట్టుకుంది.

నిన్ను కోరి మరియు మజిలీ చిత్రాలతో దర్శకుడు శివ నిర్వాన బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్నాడు.ఇప్పుడు ఈయన మూడవ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

నిన్ను కోరి నుండి నానిని మజిలీ నుండి సమంతను తీసుకుని ఒక కొత్త సినిమాను శివ నిర్వాన తెరకెక్కించబోతున్నాడు.సినిమా ప్రకటనతోనే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ అంతా అనుకుంటున్నారు.

నిజంగా ఈ చిత్రంతో నాని మరియు సమంతలు మరోసారి శివ నిర్వానకు సక్సెస్‌ ఇస్తారంటూ ప్రేక్షకులు నమ్ముతున్నారు.

Telugu Nani, Majili, Samantha, Siva Nirvana, Tollywood Box-

నాని మరియు సమంతల జోడీకి మంచి పేరుంది.వీరిద్దరు ఎటో వెళ్లి పోయింది మనసు అనే చిత్రంలో నటించారు.ఆ చిత్రంలో చాలా విభిన్నమైన ప్రేమకథలో వీరు నటించారు.

ఆ సినిమాలో వీరిద్దరి నటన పీక్స్‌లో ఉంటుంది.ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా అద్బుతంగా పండింది.

అందుకే మళ్లీ వీరి కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube