నానిని సెట్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల! అంతా మెగా ఫ్యామిలీ దయ  

శ్రీకాంత్ అడ్డాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని.

Nani Gives Green Signal To Srikanth Addala-

కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి రెండో సినిమానే సూపర్ స్టార్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం సొంతం చేసుకొని దానితో కూడా సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇక తరువాత ఈ క్లాసిక్ దర్శకుడు వరుణ్ తేజ్ ని ముకుంద కి టాలీవుడ్ కి పరిచయం చేసాడు. అంత వరకు తెలుగు నేటివిటీని అద్బుతంగా ఆవిష్కరించే దర్శకుడు అంటూ ప్రసంశలు అందుకున్న శ్రీకాంత్ అడ్డాల కెరియర్ ఒక్కసారిగా బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తో మారిపోయింది..

నానిని సెట్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల! అంతా మెగా ఫ్యామిలీ దయ-Nani Gives Green Signal To Srikanth Addala

భారీ తారాగణంతో, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో తీసిన ఆ సినిమా థియేటర్ లో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. ఇదిలా ఉంటే ఆ సినిమా తర్వాత అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిన శ్రీకాంత్ చాలా గ్యాప్ తీసుకొని అతి కష్టం మీద మెగా కాంపౌండ్ లోకి వచ్చి చేరాడు. పరశురాం లాంటి దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చి గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ తో మళ్ళీ క్రేజీ దర్శకుడుగా మార్చిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు శ్రీకాంత్ తో సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తుంది.

దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసింది. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం క్రేజీలో ఉన్న హీరోలని పరిశీలించిన ఎవరు ముందుకి రాలేదు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నాని శ్రీకాంత్ స్క్రిప్ట్ కి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది.

తాజాగా జెర్సీ లాంటి సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు కాబట్టి అతనితో సినిమా తీసి హిట్ కొడితే మళ్ళీ శ్రీకాంత్ లైన్ లో వచ్చేయడం గారంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.