విక్రమ్ కుమార్ ఫ్లాప్ మూవీ మూడు భాషల్లో రీమేక్... సంతోషంలో దర్శకుడు

టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ నానితో తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ మూవీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వచ్చిన ఎందుకో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

 Nani Gang Leader Remake In Other Languages-TeluguStop.com

ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే విషయం మాత్రం విక్రమ్ కుమార్ కి ఇప్పటికి అర్ధం కావడం లేదంట.తన ప్రతి సినిమాలో ఒక యునిక్ పాయింట్ ని టచ్ చేసే విక్రమ్ కె కుమార్ గ్యాంగ్ లీడర్ మూవీలో వేరొకరి రివెంజ్ కోసం హీరో విలన్ తో పోరాడుతాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు.తాజాగా విక్రమ్ కె కుమార్ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

 Nani Gang Leader Remake In Other Languages-విక్రమ్ కుమార్ ఫ్లాప్ మూవీ మూడు భాషల్లో రీమేక్… సంతోషంలో దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయ్యింది అంటే ఇప్పటికి నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదని చెప్పుకొచ్చారు.తాను ఏ కథ రాసుకున్న ముందుగా తన భార్యకిచెబుతానని, ఆమె నా సినిమాలకి బెస్ట్ క్రిటిక్ అని చెప్పాడు.

గ్యాంగ్ లీడర్ కథ చెప్పినపుడు ఆమె కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని, అలాగే నానికి కోడా ఈ మూవీ భాగా నచ్చిందని చెప్పారు.

Telugu Bollywood, Nani Gang Leader, Other Languages, South Cinema, Tollywood, Vikram K Kumar-Movie

అయితే భారీ అంచనాలాతో వచ్చిన సినిమా థియేటర్ లో మాత్రం ప్రేక్షకుల ఎందుకు మెప్పించలేకపోయింది అర్ధం కావడం లేదని దర్శకుడు చెప్పుకొచ్చారు.అయితే ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీ, తమిళ్, మలయాళీ బాషలలో రీమేక్ అవుతుందని తనకి ఇంతకంటే కావాల్సింది ఏముందని సంతృప్తి వ్యక్తం చేశారు.మొత్తానికి తెలుగులో డిజాస్టర్ అయిన ఒక మూవీ ఇతర బాషలలో రీమేక్ కావడం అంటే నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి ఆయా బాషలలో దర్శకులు ఈ కథని ఎలా ప్రెజెంట్ చేస్తారనేది చూడాలి.

#Other Languages #Vikram K Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు