నాని 'గ్యాంగ్‌ లీడర్‌'కు పెద్ద కష్టమొచ్చిందే!  

Nani Gang Leader Movie Release Date Problem-

నాని ‘జర్సీ’ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకుని మంచి ఊపు మీదున్నాడు.ఇలాంటి సమయంలో ఈయన చేస్తున్న సినిమా ‘గ్యాంగ్‌ లీడర్‌’.విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుండి ఏదో ఒక వివాదం, విమర్శలు వస్తూనే ఉన్నాయి.టైటిల్‌ వివాదం సమసి పోవడంతో పాటు షూటింగ్‌ ఇబ్బంది లేకుండా ముగింపు దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో విడుదల తేదీ విషయంలో పెద్ద కష్టం వచ్చింది..

Nani Gang Leader Movie Release Date Problem--Nani Gang Leader Movie Release Date Problem-

సాహో చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతుందని పలు సినిమాలు అందుకు తగ్గట్లుగా షెడ్యూల్‌ చేసుకోవడం జరిగింది.కాని ఇప్పుడు హఠాత్తుగా సాహో సినిమాను ఆగస్టు 30న విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.నేడో రేపో ఆగస్టు 30న విడుదల తేదీ అంటూ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ సమయంలో నాని గ్యాంగ్‌ లీడర్‌ కు విడుదల సమస్య తలెత్తింది.

ఎలాంటి పోటీ లేకుండా, ఎవరికి పోటీ కాకుండా గ్యాంగ్‌ లీడర్‌ను ఆగస్టు 30న విడుదల చేయాలని నాని అండ్‌ టీం భావించారు.కాని ఇప్పుడు ఆ డేట్‌ను సాహో కోరుకుంటున్న నేపథ్యంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను వాయిదా వేయాల్సిందే అంటూ నిర్ణయానికి వచ్చారు.సాహో విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన తర్వాత గ్యాంగ్‌ లీడర్‌ విడుదల తేదీలో మార్పుపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.నాని ఈ చిత్రంలో ఆడవారి సమస్యలపై పోరాడే యువకుడిగా కనిపించబోతున్నాడు..

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.