'సాహో' ఆట పూర్తి  

Nani Gang Leader Movie Dominate Sahoo Movie-prabhas,sahoo Movie,sradha Kapoor,tollywood

ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం రెండు వారాల రన్‌ పూర్తి చేసుకుంది.మొదటి వారంలో దాదాపుగా 375 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను దక్కించుకున్న సాహో చిత్రం రెండవ వారంలో మరో 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.మొత్తంగా చూసుకున్నా కూడా సినిమా కలెక్షన్స్‌ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చినట్లే.రెండు వారాల తర్వాత టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో విడుదల అయిన సినిమాలతో సాహో చిత్రం ఆట ముగిసింది.దేశ వ్యాప్తంగా కేవలం 100 నుండి 125 థియేటర్లలో మాత్రమే సాహో ఆడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Nani Gang Leader Movie Dominate Sahoo Movie-prabhas,sahoo Movie,sradha Kapoor,tollywood-Nani Gang Leader Movie Dominate Sahoo Movie-Prabhas Sahoo Sradha Kapoor Tollywood

Nani Gang Leader Movie Dominate Sahoo Movie-prabhas,sahoo Movie,sradha Kapoor,tollywood-Nani Gang Leader Movie Dominate Sahoo Movie-Prabhas Sahoo Sradha Kapoor Tollywood

ఓవర్సీస్‌లో మొదటి వారంలోనే సినిమాను తొలగించే పరిస్థితి వచ్చింది.సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రాన్ని చూడలేదు.

చూడాలనుకున్న వారు మొదటి రెండు వారాల్లోనే చూసేశారు.ఇంకా ఈ చిత్రంకు వసూళ్లు వస్తాయనే నమ్మకం బయ్యర్లకు మరియు నిర్మాతలకు లేదు.అందుకే థియేటర్ల కిరాయి బొక్క ఎందుకు అనే ఉద్దేశ్యంతో సాహో చిత్రంను థియేటర్ల నుండి తొలగించాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రంలో నాని హీరోగా నటించగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించాడు.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక సాహో చిత్రాన్ని చూస్తారనే నమ్మకం లేదు.

సహజ నటుడిగా గుర్తింపు దక్కించుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరును దక్కించుకున్న నాని గ్యాంగ్‌ లీడర్‌ రాకతో సాహో చిత్రం వసూళ్లు గణనీయంగా తగ్గాయి.సాహో చిత్రం ఇక మరో వారం రోజుల్లో పూర్తిగా కనిపించకుండా పోనుంది.వచ్చే వారంలో వాల్మీకి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.