నజ్రియా ఎవరి ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు.. చాలామందిని ట్రై చేశాం.. నాని కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటించిన తాజా చిత్రం అంతే సుందరానికి.ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

 Nani Funny Comments Nazriya Ante Sundaraniki Teaser Launch Program , Nani , Ante-TeluguStop.com

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం.

టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లోని ఏఎంజి లో జరిగింది.అయితే ఈ లాంచ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటుగా హీరో నాని హీరోయిన్ నజ్రియా కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ.తనకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని.

ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అని తెలిపాడు నాని.దర్శకుడు వివేక్ ఆత్రేయ ఏ సినిమా చేసినా కూడా.

కథను అతను తప్ప వేరే ఎవరూ అంత బాగా చెప్పలేరు అని చెప్పుకొచ్చాడు.

Telugu Antesundaraniki, Nani, Naveen Yerneni, Nazriya, Teaserlaunch, Vivek Atrey

అలాగే సినిమా టీజర్ లో చూపించిన దాని కంటే రెండు రెట్లు ట్రైలర్ పది రెట్లు సినిమా ఉంటుంది అని తెలిపాడు నాని.అనంతరం హీరోయిన్ నజ్రియా గురించి మాట్లాడుతూ నజ్రియాను తెలుగులోకి తీసుకురావడానికి ఎంతో మంది ప్రయత్నించారు.ఎవరు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు.

కానీ మా సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపింది అందుకు నజ్రియాకు ధన్యవాదాలు అని తెలిపాడు నాని.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

నాని అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube