మంచు మనోజ్ ఉస్తాద్ గేమ్ షో ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

మంచు మనోజ్( Manoj ) చాలా రోజుల తర్వాత తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీ అవుతున్నారు.ఈయన ఒకవైపు సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు పలు టాక్ షోలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు.

 Nani First Guest For Manoj Ustad Game Show , Ustad, Nani, Manoj , Tollywood-TeluguStop.com

చాలా రోజుల తర్వాత మనోజ్ ఉస్తాద్ ( Ustaad ) అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ టాక్ షో ఈ టీవీ విన్ ఛానల్ లో డిసెంబర్ 15వ తేదీ ప్రసారం కానుంది.

ఇలా వారానికి ఒకసారి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఈవెంట్లను నిర్వహించారు.తాజాగా మేకర్స్ నుంచి ఈ కార్యక్రమానికి రాబోతున్నటువంటి ఫస్ట్ ఎవరో గెస్ట్ చేయండి అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.ఇందులో మనోజ్ఆ గెస్ట్ ను హగ్ చేసుకుని ఉన్నారు అయితే ఆయన ఫేస్ మాత్రం కనపడలేదు కానీ ఫస్ట్ గెస్ట్ గా మాత్రం నాచురల్ స్టార్ నాని( Nani )రాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.ఈయన నటించిన హాయ్ నాన్న ( Hai Naana ) సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తుంది.

ఇక మొదటి సీజన్లో మంచి కుటుంబానికి చెందినటువంటి వారెవరో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం.బహుశా మంచు ఫ్యామిలీ మెంబర్స్ రెండవ సీజన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక మొదటి సీజన్లో నానితో పాటు మాస్ మహారాజ రవితేజ, అలాగే అడివి శేష్ కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈయన ఈ టాక్ షోతో పాటు వాట్ ది ఫిష్ అనే సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube