ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు హడావుడి ఏంటో?

కరోనా కారణంగా మూత పడ్డ థియేటర్లు మరో నెల రెండు నెలల్లో ఓపెన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ అయిదు నెలలు బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి.

 Telugu Movies Is Going To Release In Ott,nani V Movie, Nani, Dil Raju, Ott Relea-TeluguStop.com

తమిళంలో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.కాని టాలీవుడ్‌లో మాత్రం పెద్ద సినిమాలు విడుదలకు ఇష్టపడలేదు.

కొన్ని సినిమాల పేర్లు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి అంటూ వచ్చాయి.కాని అవి ఓటీటీ ముందుకు రాలేదు.

ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా వెయిట్‌ చేస్తున్నారు.

దిల్‌రాజు తన వి సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చాడు.

ఆయన పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఇచ్చేందుకు ఓటీటీ సిద్దం అయ్యిందట.దాంతో ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.

ఆ తర్వాత పలు తెలుగు సినిమాలు కూడా ఓటీటీ దారి పట్టే అవకాశం ఉందని అంటున్నారు.ఇన్ని రోజులు వెయిట్‌ చేసిన వారు వరుసగా ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా రాబోతున్నారు.

అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

Telugu Dil Raju, Nani, Ott, Telugu Ott, Tollywood-

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 1 నుండి థియేటర్లు ఓపెన్‌కు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.సరే సెప్టెంబర్‌ 1 నుండి కాకున్నా అక్టోబర్‌ నుండి అయినా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉంది.అలాంటిది ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయడం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయిదు నెలలు వెయిట్‌ చేసిన వారు మరో నెల రెండు నెలలు వెయిట్‌ చేస్తే బాగుండేది కదా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube