విమర్శలకు చెక్ పెట్టిన నాని.. అసలేమైందంటే..?

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.కెరీర్ మొదట్లో విభిన్నమైన పాత్రల్లో నటించిన నాని ఈ మధ్య కాలంలో రొటీన్ సినిమాల్లో నటిస్తున్నాడని నాని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.

 Nani Counter To Critics With Shyam Singaray Movie-TeluguStop.com

కథల ఎంపికలో లోపం వల్ల ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాపులుగా నిలిచాయి.

యంగ్ హీరోలతో పాటు మిడిల్ రేంజ్ హీరోలు సైతం నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో భిన్నమైన పాత్రలో నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ తోనే చెప్పేశారు.

 Nani Counter To Critics With Shyam Singaray Movie-విమర్శలకు చెక్ పెట్టిన నాని.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లుక్ విషయంలో కొత్తగా కనిపించడంతో పాటు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో శ్యామ్ సింగరాయ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

తొలి సినిమా ట్యాక్సీవాలాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.నాని డ్రెస్సింగ్ స్టెయిల్, హెయిల్ స్టెయిల్ తో పాటు మీసాల విషయంలో కూడా మార్పు చూపించారు.నాని కొత్త లుక్ లో కనిపించడంతో అతని ఫ్యాన్స్ సైతం అవాక్కయ్యారు.

ప్రస్తుతం నాని టక్ జగదీష్ మూవీతో పాటు శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ తెరకెక్కుతుంది.

ఏప్రిల్ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.శ్యామ్ సింగరాయ్ నాని సినీ కెరీర్ లో మెమరబుల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ ఏడాది సెకండాఫ్ లో శ్యామ్ సింగరాయ్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#Look Change #Shyam Singaroy #Siva Nirvana #Tuck Jagadish #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు