ఈ యాంకర్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు వెయిటింగ్.. కారణం ఆ సెంటిమెంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతోంది.

 Nani Comments On Anchor Suma Kanakala, Suma Kanakala, Nani, Shyam Singarai, Toll-TeluguStop.com

వెండితెరపై కానీ బుల్లితెరపై కానీ, ఈవెంట్ లకు, ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ వేడుకలకు ఇలా ప్రతి ఒక్క వేడుకలో కూడా యాంకర్ సుమ మెరుస్తూ ఉంటుంది.అలాంటి యాంకర్ సుమ పై తాజాగా టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని పంచులు వేస్తూ, సుమకు ఉన్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చాడు.

శ్యామ్ సింగరాయ్ ఈవెంట్ లో భాగంగా హీరో నాని మాట్లాడుతూ.

మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు.

కానీ హీరోలందరూ కూడా సుమ డేట్స్ కోసం వెయిట్ చేస్తారు.మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అన్న,ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలి అన్న సుమ గారి డేట్ కాళీ ఉందా లేదా అని ఆలోచిస్తాము.సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాను.అలా సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ కూడా ఒకరి డేట్స్ కోసం వెయిట్ చేస్తారు అంటే అది ఖచ్చితంగా సుమ గారి డేట్స్ కోసమే అంటూ సుమకు ఉన్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు నాని.

యాంకర్ గా చేస్తూ దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ సుమదే అగ్రస్థానం.

యాంకర్ గా ఆమె చేసే హడావిడి, ఆమె మాట తీరు, డైలాగులు పంచులు ఇవన్నీ కూడా సినిమాకు సరిలేరు ఎవరు అనేలా చేశాయి.ఇప్పటికీ బుల్లితెర పైనే కాకుండా సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా కూడా సుమ ఉండాల్సిందే.సుమ అంటే పేరు కాదు నోరు అన్న విషయం అందరికి తెలిసిందే.

బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదం సుమని చూసి పుట్టి ఉంటుంది అంటూ ఆమె పై ప్రశంసల వర్షం కురిపించారు నాని.స్టార్ హీరోయిన్లకు అయినా కాస్త గ్యాప్ దొరుకుతుందేమో కానీ ఆమెకు మాత్రం వరుస ఈవెంట్ లతో బుల్లితెర కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది.

అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత జయమ్మ పంచాయితీ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది అంటూ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube