నిన్నటి ఎపిసోడ్ లో నాని చెప్పిన పిట్ట కథ వెనక ఇంత స్టోరీ ఉందా.? ఎవర్ని ఉద్దేశించి అన్నారంటే.?

ఇంకొంచెం మసాలా అంటూ మొదలయిన బిగ్ బాస్ రెండో సీజన్ ప్రస్తుతం మూడో వారం పూర్తి చేసుకుంది.హోస్ట్ నాని మసాలాను పెంచే ప్రయత్నం బాగానే చేస్తున్నారు.

 Nani Butter Fly Storybigg Boss 2 Telugu-TeluguStop.com

ఈ ప్రయత్నంలో భాగంగానే పూరి జగన్నాధ్ గారి స్టైల్ లో పిట్ట కథలు కూడా చెప్పేస్తున్నారు.దాంట్లో నీతి కూడా చాలా ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే.!

శనివారం నాటి ఎపిసోడ్‌లో మరోసారి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాని.తనదైన శైలిలో హౌస్‌మేట్స్‌కు చురకలంటించారు.బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యులను ఉద్దేశించి.

ఎప్పటిలాగే నాని ఈ రోజు ఓ పిట్ట కథ చెప్పారు.అదేంటో ఓ లుక్ వేసుకుందాం.!”అనగనగా ఓ రాజుగారు ఉంటారు.ఆ రాజుకు ఓ చిలుకంటే చాలా ఇష్టం.

దాన్ని ఎప్పుడూ ప్రాణంగా చూసుకునేవాడు.ఓ రోజు ఆ చిలుక రాజుకు ఓ పండు ఇస్తుంది.

దాన్ని తింటే నిత్య యవ్వనం వస్తుందని చిలుక చెబుతుంది.అయితే, ఆ రాజు అది చెప్పింది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు దాన్ని ఓ సైనికుడికి ఇచ్చి తినమన్నాడు.

అది తిన్న సైనికుడు చనిపోతాడు.

దీంతో ఆ రాజ్యంలో ప్రజలంతా ఆ చిలుక రాజుగారిని చంపాలని చూసిందని, ఆ చిలుక మంచిది కాదని చెప్పుకోవడం విని రాజు ఆ చిలుకను వధిస్తాడు.

అనంతరం ఆ చిలుక ఏ చెట్టు నుంచైతే ఆ పండును తెచ్చిందో ఆ చెట్టు పండ్లను తినొద్దని ప్రజలకు దండోరా వేయిస్తాడు.ఓ రోజు పక్క రాజ్యం నుంచి వచ్చిన ఓ వృద్ధ జంట.ఆ చెట్టు గురించి తెలియక పండు కోసి తింటారు.వారికి వెంటనే వృద్ధాప్యం పోయి.

యవ్వనం వస్తుంది.అయితే, ఆ సైనికుడు ఎలా చనిపోయాడని ఆరా తీస్తే.

ఆ పండు తిన్న సైనికుడు పాము కరవడం వల్ల చనిపోయాడని తెలుస్తోంది.

అయితే ఈ పిట్ట కథలో ఉన్న నీతి ఏంటో తెలుసుకుందామా.? ఇంతకీ ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనే డౌట్ కూడా అందరికి వచ్చే ఉంటది.ఈ పిట్ట కథను కిరీటీని ఉద్దేశించి తెలిపారు నాని.

కౌశల్ గురించి ఇంట్లో సభ్యులంతా అనుకుంటున్న ఓ విషయాన్ని విని.అతడు రాజుగారిలా ప్రవర్తించాడని, చివరికి పశ్చాతాపం పడుతున్నాడంటూ నాని పిట్టకథ వెనుక ఉన్న నీతిని వివరించారు.

మొత్తానికి మరొకరి మాటలు వినకుండా , మనల్ని మనం నమ్మాలని అసలు అంతరార్థం.ఇది హౌస్ మేట్స్ కె కాదు మనకి కూడా వర్తిస్తుంది అండోయ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube