బాబోయ్‌.. నాని 'బ్రహ్మూెత్సవం' ప్రయోగం  

Nani Brahmotsavam Experiment-career,experiment,nani,project,బ్రహ్మూెత్సవం

నాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌ ఆరంభం నుండి కూడా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్‌ హిట్‌ మూవీలను కూడా చేశాడు. కొందరు దర్శకులతో నాని సినిమా చేసేందుకు ఓకే చెప్పి తప్పు చేస్తున్నాడేమో అనే విమర్శలు ఎదుర్కొన్నాడు...

బాబోయ్‌.. నాని 'బ్రహ్మూెత్సవం' ప్రయోగం-Nani Brahmotsavam Experiment

అయితే ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నాని ఈజ్‌ రైట్‌ అంటూ అందరితో అనిపించుకున్నాడు. తాజాగా నాని చేసిన ‘జర్సీ’ చిత్రంకు అద్బుతమైన స్పందన దక్కింది. కమర్షియల్‌గా ఓకే అనిపించుకున్నా కూడా నాని ఈ చిత్రంతో తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనే చిత్రాన్ని మరియు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వీ’ అనే చిత్రాన్ని నాని చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత నాని డిజాస్టర్‌ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో ఒక చిత్రంను చేసేందుకు కమిట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దిల్‌రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాంత్‌ అడ్డాల బ్రహ్మూెత్సవం చిత్రం తర్వాత మరే ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు.

ఎన్నో కథలు తయారు చేసుకున్న తర్వాత దిల్‌రాజు ఒక కథకు ఫైనల్‌గా ఓకే చెప్పాడు. మీడియం బడ్జెట్‌తో శ్రీకాంత్‌ అడ్డాలతో సినిమాను నిర్మించేందుకు దిల్‌రాజు ఒప్పుకున్నాడు.

ఇక ఇటీవలే శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథతో నాని ఇంప్రెస్‌ అయ్యి తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎప్పటికప్పుడు తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించే హీరో నాని, ఈయన మళ్లీ శ్రీకాంత్‌ అడ్డాలతో ఒక విభిన్నమైన చిత్రాన్ని ఇస్తాడని ప్రేక్షకులు నమ్ముతున్నాడు.

తప్పకుండా బ్రహ్మూెత్సవం తరహాలో కాకుండా ఒక మంచి సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల ఇస్తాడని నాని నమ్మకంగా ఉన్నాడు. మరి నాని నమ్మకంను శ్రీకాంత్‌ నిలుపుకుంటాడా చూడాలి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2020 ఆరంభంలో సినిమా ప్రారంభం అయ్యి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.