నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడనే అంశం తెలిసినప్పటి నుండి ఈ సినిమాను చూసేందుకు నాని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటివరకు కేవలం టీజర్‌ను మాత్రమే రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాతో నాని మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుండటం, నాని పాత్రపై ఇప్పటకే పలు అంచనాలు రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా ట్రైలర్‌ను అతి త్వరలో రిలీజ్ చేసి, సినిమా ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమాలో నాని, సుధీర్ బాబులతో పాటు నివేదా థామస్, అదితి రావు హైదరీ నటిస్తున్నారు.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.మరి ఈ సినిమాతో నాని మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.