అప్పుడు విజయ్‌ దేవరకొండ, ఇప్పుడు నాని మహేష్‌ బాబు వీరినే ఎందుకు కోరుకుంటున్నాడు?  

Nani Attend Special Guest For Maharshi 50 Days Function-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా వేడుకల్లో గతంలో ఎక్కువగా గెస్ట్‌లు కనిపించే వారు కాదు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.మహేష్‌బాబు తన సినిమా వేడుకలకు ఇతర హీరోలను గెస్ట్‌లుగా ఆహ్వానిస్తున్నాడు.భరత్‌ అనే నేను చిత్రంకు ఎన్టీఆర్‌ గెస్ట్‌గా వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పుడు మహర్షి చిత్రంకు గాను ఇద్దరు యంగ్‌ హీరోలను మహేష్‌బాబు గెస్ట్‌లుగా తీసుకు వచ్చాడు.

Nani Attend Special Guest For Maharshi 50 Days Function--Nani Attend Special Guest For Maharshi 50 Days Function-

అయితే యంగ్‌ హీరోల వెనుక మహేష్‌ బాబు పడటం ఏంటీ అంటూ కొందరు సినీ వర్గాల వారు ఆలోచనలో పడ్డారు.

Nani Attend Special Guest For Maharshi 50 Days Function--Nani Attend Special Guest For Maharshi 50 Days Function-

మహర్షి చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ సందడి చేశాడు.ఇక తాజాగా మహర్షి 50 రోజుల వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నేటితో సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.దాంతో రేపు 50 రోజుల వేడుక నిర్వహించబోతున్నారు.ఈ వేడుకలో యంగ్‌ హీరో నాని పాల్గొనబోతున్నాడు.నాని ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న కారణంగా నాని మహర్షి మేకర్స్‌ ఆహ్వానంకు వెంటనే ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్‌బాబు వంటి సూపర్‌ స్టార్‌ సినిమాల వేడుకలకు యంగ్‌ హీరోలు గెస్ట్‌లుగా రావడం ఆశ్చర్యకర విషయంగా చెప్పుకోవాలి.ఎందుకంటే ఒక హీరో తనకంటే పెద్ద హీరోను లేదంటే తన స్థాయి హీరోను గెస్ట్‌లుగా ఆహ్వానించాలని భావిస్తాడు.కాని మహేష్‌ బాబు మాత్రం తన ఇమేజ్‌తో సంబంధం లేకుండా యంగ్‌ హీరోలను తన సినిమాకు గెస్ట్‌లుగా తీసుకు వచ్చి ఇతర హీరోలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాడు.