అంటే సుందరానికీ అప్పుడే టెండర్ పెట్టారా?

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో, నాని ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు.

 Nani Ante Sundaraniki Rights Acquired By Zee, Nani, Ante Sundaraniki, Zee Group,-TeluguStop.com

ఇప్పటికే టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఓకే చేశాడు నాని.

దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే… సుందరానికీ’ అనే టైటిల్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు నాని సిద్ధమయ్యాడు.

కాగా ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ను జీ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా హక్కులను ఏకంగా రూ.55 కోట్ల భారీ డీల్‌కు జీ గ్రూప్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి షూటింగ్ కూడా మొదలుకాని ఈ సినిమా హక్కులను అప్పుడే ఇంత భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో నాని చేయబోయే కామెడీ రోల్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో నాని కామెడీ జోనర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.మరి అంటే సుందరానికి చిత్రం హక్కులు నిజంగానే అమ్ముడయ్యాయా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube