ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు, అంటే నానికి..!

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది.జులై 10వ తారీకున విడుదల కాబోతుంది.

 Nani Ante Sundaraniki Promotions Not Doing Yet , Ante Sundaraniki , Ante Sundaraniki Release Date , Movie News , Nani , Vivek Atreya-TeluguStop.com

విడుదల తేదీకి మరో అయిదు వారాలు మాత్రమే ఉంది.అయినా ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన హడావుడి ఏమీ లేదు.

ఒక పాటను విడుదల చేసి చిన్న టీజర్ ను విడుదల చేశారు.ఈమద్య కాలంలో సినిమా లను చేసిన దాని కంటే దాన్ని ప్రమోట్ చేయడం కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

 Nani Ante Sundaraniki Promotions Not Doing Yet , Ante Sundaraniki , Ante Sundaraniki Release Date , Movie News , Nani , Vivek Atreya-ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు, అంటే నానికి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆన్ లైన్ లో… ఆఫ్‌ లైన్ లో.సోషల్‌ మీడియా.వెబ్‌ మీడియా ఇలా అన్ని చోట్ల కూడా సినిమా ను ప్రమోట్‌ చేస్తేనే అప్పుడు ప్రేక్షకులకు చేరువ అవుతుంది.అందుకే నాచురల్‌ స్టార్‌ నాని అంటే సుందరానికి సినిమాను కూడా భారీ ఎత్తున ప్రమోట్‌ చేయాలని అబిమానులు కోరుకుంటున్నారు.

కాని ఇప్పటి వరకు అగ్రెసివ్‌ గా సినిమా ప్రమోషన్ ను చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.దాంతో అంటే నానికి ఈ సినిమా పై ఏమైనా అనుమానం ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.

కొందరు మాత్రం సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉండటం వల్లే ప్రమోషన్‌ విషయంలో అశ్రద్ద చూపిస్తున్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నాని మరియు వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందిన ఈ ఫుల్‌ మాస్ కామెడీ ఎంటర్‌ టైన్ మెంట్‌ ను జనాలు ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాచురల్‌ స్టార్ నాని ఈ సినిమా ను పూర్తి చేసి ప్రస్తుతం దసరా పనిలో ఉన్నాడు.విడుదల ఒకటి లేదా రెండు వారాలు ఉండగా అప్పుడు మీడియా ముందుకు ఈ సినిమా కోసం వస్తాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube