అంటే సుందరం మరీ ఇంత క్లాస్ అయితే ఎలా గురూ

నాని హీరోగా ఇప్పటికే టక్ జగదీష్‌ సినిమా షూటింగ్‌ ముగించి విడుదలకు సిద్దం చేశారు.సినిమా విడుదల సమయంలో కరోనా సెకండ్‌ వల్ల నిలిచి పోయింది.

 Nani Ante Sundaraaniki Movie First Look-TeluguStop.com

గత ఏడాదిలో విడుదల అవ్వాల్సిన జగదీష్‌ ఎప్పటికి వస్తాడో అర్థం కావడం లేదు.ఇదే సమయంలో శ్యామ్ సిగరాయ్‌ అనే భారీ సినిమాను నాని చేశాడు.

నిన్నటితో సినిమా షూటింగ్‌ ముగించేశాడు.షూటింగ్‌ ముగియడంతో ప్రస్తుతం శ్యామ్‌ సింగరాయ్‌ కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది.

 Nani Ante Sundaraaniki Movie First Look-అంటే సుందరం మరీ ఇంత క్లాస్ అయితే ఎలా గురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న శ్యామ్‌ సింగరాయ్‌ ను ముగించిన నాని వెంటనే కొత్త సినిమా షూటింగ్‌ లో జాయిన్ కు సిద్దం అయ్యాడు.శ్యామ్‌ సింగరాయ్ లో మీసంతో కనిపించిన నాని సుందరం సినిమా కోసం గడ్డం మరియు మీసాలు తొలగించాడు.

గడ్డం తొలగించడం పర్వాలేదు కాని మీసాలు కూడా తొలగించడంతో నాని కొత్తగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా షూటింగ్‌ కోసం నాని గడ్డం మరియు మీసాలు తొలగించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మీసాలను స్వయంగా తీసేస్తూ నాని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.నాని అంటే సుందరానికి సినిమా లో చాలా క్లాస్‌ గా కనిపించబోతున్నాడు.

నాని మాస్ లుక్‌ లో ఇప్పటికే నటించి మెప్పించాడు.

Telugu Ante Sundaraaniki, Film News, Movie News, Nani, Nani Hero, Tuck Jagadeesh-Movie

నాని సహజంగానే క్లాస్ లుక్ లో కనిపిస్తాడు.ఇలాంటి సమయంలో నాని మరింత క్లాసీగా కనిపించడం తో అభిమానులు మరీ ఇంత క్లాస్ ఏంటీ గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.బాబోయ్‌ కాస్త మాస్ ట్రై చేయవయ్యా బాబు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి నాని కొత్త సినిమా అంటే సుందరానికి ఇప్పటి నుండే ట్రెండ్‌ లో నిలిచింది.ఈ సినిమా ను కూడా ఇదే ఏడాదిలో ముగించేసే లా ప్లాన్‌ చేస్తున్నాడు.

#Sundaraaniki #Nani #Tuck Jagadeesh #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు