యంగ్ హీరో నాని ఈమద్య కాలంలో సినిమాల స్పీడ్ కాస్త తగ్గించినట్లుగా అనిపిస్తుంది.నాని ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.మొదట ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అంటూ ఖరారు చేసి టైటిల్ లోగోను విడుదల చేశారు.
అయితే మద్యలో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది.దాంతో పాటు మెగా మూవీ టైటిల్‌ను నీవు పెట్టుకోవడం ఏంటీ అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ హెచ్చరించారు.
మెగా ఫ్యాన్స్ హెచ్చరికలు మరియు ఇతరత్ర కారణాల వల్ల గ్యాంగ్ లీడర్ చిత్రం టైటిల్‌ను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.నాని కూడా ఒకానొక సమయంలో మాట్లాడుతూ తాను టైటిల్ విషయంలో ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు.పూర్తి వివరాలు త్వరలోనే మీకు తెలుస్తాయని చెప్పాడు.దాంతో టైటిల్ మార్పిడి నిర్ణయం జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే తాజాగా టైటిల్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఈ లుక్‌ను రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా టైటిల్‌ను గ్యాంగ్ లీడర్ గానే ఉంచినట్లుగా నిర్ధారించారు.ఆడవారి పక్షాన పోరాడే ఒక వ్యక్తిగా నాని కనిపించబోతున్నాడు.
అందుకే ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ టైటిల్‌కు నాని పూర్తి న్యాయం చేస్తాడని నమ్మకం వ్యక్తం అవుతుంది.
మెగా వారి బెదిరింపులకు నాని బెదరకుండా సినిమాపై నమ్మకంతో అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.