ప్రభాస్ 'ప్రాజెక్ట్‌ కే' లో నాని, విజయ్‌ దేవరకొండలు?

ప్రభాస్‌ మరియు నాగ్‌ అశ్విన్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతోంది.సినిమాలోని కీలకమైన సన్నివేశాల్లో నటించడానికి గాను ఇద్దరు యంగ్‌ హీరోలను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.

 Nani And Vijay Devarakonda In Project K Movie-TeluguStop.com

నాగ్‌ అశ్విన్ కు సన్నిహితులు స్నేహితులు గా పేరున్న నాని మరియు విజయ్ దేవరకొండలు ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ ను ముగించిన దర్శకుడు తదుపరి షెడ్యూల్‌ కోసం సెట్‌ ను రెడీ చేయిస్తున్నాడు.

అమితా బచ్చన్‌ కాంబోలో కొన్ని సన్నివేశాలు పూర్తి అయ్యాయి.తదుపరి షెడ్యూల్‌ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు.

 Nani And Vijay Devarakonda In Project K Movie-ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే’ లో నాని, విజయ్‌ దేవరకొండలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో అమితాబచ్చన్‌ కాంబినేషన్లో ఇద్దరు హీరోల సన్నివేశాలు ఉంటాయట.వాటి ద్వారా సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతాయని అలాగే సినిమాలోని సన్నివేశాల వల్ల సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని అంటున్నారు.

ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్‌ లకు సన్నిహితు లు అయిన ఆ ఇద్దరు ఈ సినిమాలో నటించడం వల్ల సినిమా ఖచ్చితంగా హైప్‌ వస్తుంది.ఇక సినిమా ను పాన్‌ ఇండియా రేంజ్‌ లో చిత్రీకరించబోతున్నారు కనుక ఆ రెండు పాత్రలకు వేరు వేరు భాషల్లో వేరు వేరు నటులు ఉండేలా కూడా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుందని టైమ్‌ ట్రావెల్‌ సినిమా లు అవ్వడం వల్ల ఖచ్చితంగా అబ్బ అనేట్లుగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందని సినిమాను హాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారని అంటున్నారు.కనుక ఈ సినిమా తప్పకుండా ప్రభాస్ ను గ్లోబల్‌ స్టార్‌ గా నిలుపుతుందని అంటున్నారు.

#Nani #Pan India #Amitab Bachhan #Dipika Padugona #Project

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు