నాని సాహసం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! రేపే మల్టీ స్టారర్ లాంచ్

నేచురల్ స్టార్ నాని వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత జెర్సీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక జెర్సీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని పెర్ఫార్మెన్స్ ని నిజంగా ఫ్యాన్ అయిపోయారు.

 Nani And Sudheer Babu Multi Starer Movie Will Be Started Tomorrow-TeluguStop.com

అలాంటి డేరింగ్ క్యారెక్టర్ చేయాలంటే దమ్ముండాలి అంటూ నానిని ఆకాశానికి ఎత్తెస్తున్నారు.ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఏకంగా నాని పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయినట్లు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాని ఏకంగా ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ రోల్ లో కనిపించడానికి రెడీ అయిపోయాడు.తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలో మూడో సినిమాకి నాని సిద్ధం అయ్యాడు.

అయితే ఈ సినిమాలో నాని హీరోగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోగా సుదీర్ బాబ్బు కనిపిస్తాడని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి వి అని టైటిల్ ఫిక్స్ చేసిన దర్శకుడు ఇంద్రగంటి సోమవారం గ్రాండ్ గా లాంచ్ చేయడానికి రెడీ అయ్యాడు.మరి కెరియర్ లో రెగ్యులర్ కథలకి కాస్తా కొత్తదనం జోడించి అదరగొడుతున్న నానికి ఇంద్రగంటి ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube