డిసెంబర్ లో కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న నేచురల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో తనదైన మార్క్ టాలెంట్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో నాని.అతను చేసే సినిమాలన్నీ నేచురాలిటీకి దగ్గరగా, ప్రతి ఒక్కరు తమ లైఫ్ తో వోన్ చేసుకునే విధంగా ఉండటంతో పాటు, మిడిల్ క్లాస్ లైఫ్ కి దగ్గరగా ఉండే కథలని ఎంచుకోవడంతో తెలుగు ఆడియన్స్ గా భాగా దగ్గరైపోయాడు.

 Nani And Shiva Nirvana Movie On Sets In December-TeluguStop.com

దీంతో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకి లేని విధంగా తనకంటూ మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ ని తెచ్చుకునే హీరోగా నిలబడిపోయాడు.దీంతో నిర్మాతలు, దర్శకులు నానితో సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తన మొదటి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో మూడో సినిమాని ప్రస్తుతం నాని చేస్తున్నాడు.వి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అవుతూ ఉండగానే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నాని రెడీ అయిపోయాడు.తనకి నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ హిట్ ని అందించిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా డైరెక్టర్ ఫీల్ కి తగ్గట్లే ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అని తెలుస్తుంది.డిసెంబర్ లో ఈ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి సెట్స్ పైకి తీసుకెల్లబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube