చివరకు బిగ్‌బాస్‌, నానిలు కూడా సేఫ్‌ గేమ్‌కు సిద్దం అయ్యారు

వివాదాలు, గొడవల మద్య సాగిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ వారంకు చేరింది.ఈ ఆదివారంతో ఫైనల్‌ విజేత ఎవరో తేలిపోనుంది.

 Nani And Big Boss Playing Safe Game-TeluguStop.com

అందరి దృష్టి కౌశల్‌పైనే ఉన్న విషయం తెల్సిందే.కౌశల్‌ మినహా మిగిలిన అంతా కూడా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ ఇక్కడి వరకు వచ్చినట్లుగా అనిపిస్తుంది.

అయితే కౌశల్‌ మాత్రం ఆయనకు తోచిన విధంగా మాట్లాడుతూ ఆడుతున్నాడు.అందుకే కౌశల్‌కు సోషల్‌ మీడియాలో అనూహ్యంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దక్కింది.

సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ చేస్తున్న కామెంట్స్‌కు, పోస్ట్‌లకు, ట్రోల్స్‌కు బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నానితో పాటు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా ఒకవిధమైన సేఫ్‌ గేమ్‌ను మొదలు పెట్టారు.అంటే కౌశల్‌ను టార్గెట్‌ చేయకుండా, కౌశల్‌తో పదే పదే గొడవ లేకుండా చూస్తున్నారు.నాని గత శని, ఆదివారాల ఎపిసోడ్‌లను చూస్తే కౌశల్‌ విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు.ఇంటి సభ్యులను కుక్కలు అంటూ తిట్టినా కూడా కౌశల్‌పై పెద్దగా రియాక్ట్‌ కాలేదు.

కారణం కౌశల్‌ ఆర్మీ అనే విషయం అందరికి తెల్సిందే.

కౌశల్‌ ఆర్మీ గతంలో పలు సార్లు సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ ఫెయిర్‌ గేమ్‌ కాదు, నాని హోస్ట్‌గా పనికి రాడు అంటూ ట్రెండ్‌ చేసిన విషయం తెల్సిందే.ఆ ట్రెండ్స్‌ ఏ స్థాయిలో వెళ్లాయో చెప్పనక్కర్లేదు.ఇండియా వైడ్‌గా టాప్‌లో ఆ విషయం ట్రెండ్‌ అయ్యింది.

దాంతో తెలుగు బిగ్‌ బాస్‌ పరువు పోయింది.అందుకే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు మరియు నాని కౌశల్‌ విషయంలో సేఫ్‌ గేమ్‌ను మొదలు పెట్టారు.

మరో అయిదు రోజుల్లో విజేతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి సమయంలో వివాదాలను సృష్టించడం ఎందుకు అనుకున్న నాని ఆయనపై ఎలాంటి కామెంట్స్‌ చేయకుండా వదిలేశాడు.

ఇక సీజన్‌ 2 విజేత ఎవరు అయ్యి ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కౌశల్‌ ఆర్మీ దయతో కౌశల్‌ విజేతగా నిలవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది.ఆదివారం ఎపిసోడ్‌తో బిగ్‌ బాస్‌ విజేత ఎవరో తేలిపోనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube