కరోనాను అంతం చేస్తాం అంటూ.. కొడుకుతో నాని వైరల్ వీడియో!

ప్రస్తుతం మళ్లీ కరోనా ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 Nani And Arjun Fights-with Corona Nani, Tollywood, Arjun Fight, Corona, Tollywoo-TeluguStop.com

రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో దేశం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు.

ఇక అన్ని సినీ ఇండస్ట్రీలు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకోగా.సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేశారు.

ఇక షూటింగ్ వాయిదాతో నటులు తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉంటూ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు తెలుపుతున్నారు.ఇక కొందరు హీరోలు తమ పిల్లలతో సరదాగా గడుపుతూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్ తన పిల్లలతో సందడి చేస్తుండగానాచురల్ స్టార్ నాని కూడా తాజాగా తన కొడుకుతో కరోనా అంతం చేస్తామంటూ ఓ వీడియో పంచుకున్నాడు.

నాని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను పంచుకోగా అందులో నాని, తన కొడుకు అర్జున్ సైనికులుగా మారి కరోనాతో యుద్ధం చేస్తున్నారు.దుప్పటి కప్పుకొని దిండును గన్ గా భావించి వైరస్ ని షూట్ చేస్తున్నట్లు బాగా యాక్ట్ చేశారు.ఇక అర్జున్ కూడా బాగా యాక్టివ్ గా కనిపించిన ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇక నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ట‌క్ జగదీష్ ఈనెల 23న విడుదల కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల సినిమా వాయిదా పడింది.అంతేకాకుండా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube